జై భారత్ వాయిస్ వరంగల్
దత్త క్రియ యోగను ప్రతినిత్యం సాధన తో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్ తెలిపారుఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు లోని గల శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో దత్త క్రియ యోగ సాధన కార్యక్రమం నిర్వహించారు దత్త క్రియ యోగ లొ యోగాసనాలు, హఠయోగం, సూర్య నమస్కారాలు గురించి వివరించారు యోగా సాధకుడు అభినవ నేతాజీ తో యోగ ద్వారా ఆసనాలను వేయించి వాటి ప్రయోజనాలను, ప్రతినిత్యము అందరూ ఈ యోగాసనాలను అవలంబించగలరని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా దత్త ప్రచార రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామీజీ రూపొందించిన దత్త క్రియ యోగను ప్రతినిత్యం సాధన తో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు యోగ సాధన అనేది గురువు పర్యవేక్షణలతో సాధన చేయాలని సూచించారు ప్రతినిత్యం యోగా సాధనలో ధ్యానం చేస్తూ ధ్యానస్థితిని పొందవచ్చు అని ఆయన అన్నారు ఈ సందర్భంగా యోగ సాధకుడు అడప అభినవ నేతాజీని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు గోపి శర్మ, ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వై వి వామన్ రావు, ట్రస్ట్ సభ్యులు ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్, అడపా సాంబశివరావు జ్యోతి భక్తులు పాల్గొన్నారు.
previous post