Jaibharath voice Warangal
వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ పరిధిలో పైపులైన్ మరమత్తు పనులు కొనసాగుతున్నందున రెండు రోజులు (సోమ, మంగళవారం) నీటి సరఫరా ఉండదని అట్టి ఫిల్టర్ బెడ్ పరిధిలోని ప్రాంతాల ప్రజలు సహకరించాలని బల్దియా ఈఈ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ పరిధి లోని ప్రాంతాలైన దేశాయిపేట, కొత్తవాడ, ఆటోనగర్, పోచమ్మ మైదాన్ ఎల్.బి నగర్, కాశీబుగ్గ, కంటి హాస్పిటల్, ఎంజిఎం ఆసుపత్రి ఏరియా, కేఎంసి, మట్టెవాడ, వరంగల్ చౌరస్తా, బట్టల బజార్, సంతోషిమాత కాలనీ ఏరియా, హంటర్ రోడ్, చార్ బౌలి, గోవింద రాజులగుట్ట, క్రిస్టియన్ కాలనీ, లేబర్ కాలనీ, ఎస్.ఆర్.టి ఎనుమాముల, ఆరెపల్లి, కొత్తపేట, గొర్రెకుంట, కీర్తినగర్, పైడిపల్లి, మొగిలిచర్ల, ధర్మారం ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని ప్రజలు గమనించి సహకరించాలని ఈఈ కోరారు.