రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం .
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ముద్దం కృష్ణ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ నాయకులు నాగన బోయిన అనిల్, శీలం నరేష్ లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ప్రకటించడంతో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీచెప్పిన విధంగా వాగ్దా నాన్ని వందకు,వందశాతం నెరవేర్చే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం సుమారు 31 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముద్ధం సాంబయ్య, ఎనుకతాళ్ళ హంసాలురెడ్డి, పెండ్లి రమేష్, మాదం కుమార్ స్వామి, కడుదుల జనార్ధన్, సిలువేరు రాజు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
previous post