Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి – సీ ఐ క్రాంతి కుమార్

మత్తు పదార్థాల తో పెడదారి పడుతున్న యువత
-ఆత్మకూరు సిఐ క్రాంతి కుమార్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
మత్తు పదార్థాల ను సేవించడం వల్ల యువత పెడదారి పడుతున్నదని ఆత్మకూరు సిఐ వి క్రాంతికుమార్ అన్నారు.బుధవారం అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలైన మద్యం, సిగరెట్లు, గుట్కా, గంజాయి, డ్రగ్స్ వాడకం నిషేధించబడిందని చెప్పారు. యువత ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు .డ్రగ్స్, గంజాయి విక్రయిదారులకు పీడీ యాక్ట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి ప్రణాళిక బద్ధంగా చదువుకొని ముందుకెళ్లాలన్నారు. డ్రగ్స్ విక్రయాల జరిపే వ్యక్తుల వివరాలను టోల్ ఫ్రీ నెంబర్14446 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ విక్రయిదారులను ఉక్కు పాదంతో అణిచివేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులుపాల్గొన్నారు.

Related posts

సిఎం టూర్ కొచ్చినట్టే ఉంది. ప్రజల సమస్య లపై స్పందన లేదు: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

Sambasivarao

సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండి

Jaibharath News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలి