Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

యువత మాదక ద్రవ్యాలకు వ్యసన పరులు  కావద్దు డాక్టర్ అర్చన

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  అన్ని ఉప కేంద్రాల పరిధిలోని భాగంగా బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం  అక్రమ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మారకద్రవ్యాల దినోత్సవం నిర్వహించారు  ఈసందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.అవ గాహన ర్యాలీ నిర్వహించారు మండలంలోని ఆరోగ్య ఉప కేంద్రాలలోఅవగాహన కార్యక్రమము చేపట్టారు. ఈ సందర్భంగా మండలవైద్యాధికారి డాక్టర్ అర్చన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు వ్యసన పరులు  కావద్దు జీవితాన్ని బలి చేసుకోవద్దని కోరారు. టీనేజ్ పిల్లలు విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగంపై ఆకర్షితులో అయ్యే ప్రమాదం ఉందని వాటికి దూరంగా ఉండాలని కోరారు. మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన ఆరోగ్యం ఏకాగ్రత వ్యక్తిత్వం, జీవితం ధ్వంసం అవుతుందని తెలియజేశారు. మత్తు పదార్థాల దుర్వినియోగం  అక్రమ రవాణాకు వ్యతిరేకంగాజరుగుతున్న కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యాలు కావాలని సూచించారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అర్చన తోపాటు సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి,సూపర్వైజర్లు కిరణ్ కుమార్,స్వరూప, అన్ని ఉప కేంద్రాల వైద్యాధికారులు ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్ ఆశా కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

18న కలెక్టరేట్ ను జయప్రదం చేయండి

గీసుకొండ మండలంలో వైద్య శిబిరం

నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల

Sambasivarao