April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

యుద్ధ ప్రతిపాదికన లీకేజీ మరమ్మత్తు  పూర్తి చేయండి: నగర మేయర్  గుండు సుధారాణి

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ మహా నగరంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతం లో ప్రధాన పైపులైనుకు ఏర్పడ్డ మరమ్మత్తును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నగర  గుండు సుధారాణి  నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా  లీకేజీ ఏర్పడ్డ పోచంమైదానం ప్రాంతాన్ని మేయర్ క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.  
దేశాయిపేట ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో 1982 సం.లోవేసిన పైప్ లైన్ ఏర్పాటు చేసి పాత పైపులైన్లు అయినందు వల్ల తరచుగా లీకేజీ లు ఏర్పడుతున్న దృష్ట్యా అక్కడ ఇటీవల కొత్త వాల్వు  ఏర్పాటు చేసి నీటిని వదిలిన క్రమంలో దేశాయిపేట ఏరియా పోచం మైదాన్ ప్రాంతంలో ప్రధాన పైపు లైన్ కు లీకేజీ ఏర్పడడం జరిగిందని అధికారులు మేయర్ కు మేయర్ కు వివరించగా, దేశాయిపేట ఫిల్టర్ బెడ్ నుండి పోచమ్మ మైదానం సర్కిల్ వరకు కొత్త పైపులైన్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.రాత్రింబవళ్లు  పనిచేసే అట్టి నీటి లీకేజీని అరికట్టి  శుక్రవారం ఉదయం వరకు వరంగల్ నగరంలోని అన్ని ప్రాంతాలకు త్రాగు నీరు అందించాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు.మేయర్ వెంట డి ఈ లు రంగా రావు రవీందర్ ఏ ఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎలుగూర్ రంగంపేట  చెరువులో వింత చేప

మాధన్నపేట చెరువులో చేపపిల్లల విడుదల చేసిన ఎమ్మెల్యే మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద

ఉపాధి కల్పనకు సత్వర చర్యలు చేపట్టాలి-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి