Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

వైసిపి సీనియర్ నాయకుడు మృతి

అనారోగ్యంతో వైసీపీ సీనియర్ నాయకుడు నీలి నరసింహప్ప మృతి

జై భారత వాయిస్ కంబదూరు, అనంతపురం జిల్లా కందుకూరు మండలకేంద్రంకు చెందిన వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు నీలి నరసింహప్ప (94) వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు . దీంతో వైసిపీ నాయకులునీలి శంకరప్ప, వారి సోదరులకు పితృ వియోగం కలిగింది. ఈయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమై ఉప సర్పంచ్ , సర్పంచ్ గా పనిచేసి కంబదూరు ప్రజలకు ఎనలేని సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచి నాయకుడిగా నీలి నరసింహప్ప గుర్తింపు పొందాడు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనీ స్థాపించడంతో వైసీపీలో చేరాడు. నీలి నరసింహప్ప మృతి పట్ల కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

వైయస్సార్ రాజశేఖర్ రెడ్డ 75 వ జయంతి వేడుకలు

Gangadhar

జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అండర్ గ్రౌండ్ లో కట్ చేయడం జరిగినది

Jaibharath News

కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

Jaibharath News