April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

28న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు సిఎం రేవంత్ రెడ్డి సందర్శన

జై భారత్ వాయిస్ గీసుకొండ
జూన్ 28న సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును సందర్శిస్తారని, పార్క్‌లో ఏర్పాటైన పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనపై టీఎస్ఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు.ఈనెల 28 శుక్రవారం రోజున సీఎం రేవంత్‌రెడ్డి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును సందర్శించనున్న నేపథ్యంలో గురువారం గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును గురువారం అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరిశ్రమలు, పార్క్‌కు కేటాయించిన భూముల వివరాలతో కూడిన మ్యాప్‌తో పాటు హెలిప్యాడ్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెక్స్‌టైల్‌ పార్క్ సందర్శనకు శుక్రవారం వస్తున్న సందర్భంగా టీఎస్ఐఐసీ అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నాధికారులు స్థానిక ప్రజాన్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ  పిసిసి అధ్యక్ష పదవి ఎంపి బలరాం నాయక్ కు ఇవ్వాలి

ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

రంగశాయిపేట 42వ డివిజన్లో కావ్వ గెలుపుకొసం ప్రచారం