Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

రిపోర్టర్: జ్యోతి (జై భారత్ వాయిస్ హనుమకొండ) వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగ్రహం.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని అధికారులను ప్రశ్నించారు. మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయంపెంచడమెంటని నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు బాధ్యత ఉందని తేల్చి చెప్పారు.

Related posts

కేయూ భూములపై పారదర్శనంగా సమగ్ర విచారణ చేపట్టాలి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు

క్రీడలతోటే మానసిక ఉల్లాసం -హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సారంగపాణి

Sambasivarao

ప్రజాపాలనా. ప్రతీకార పాలన