మాజీ చైర్మన్ ను పరామర్శించిన టీఆర్ ఎస్ నాయకులు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొల్లెబోయిన రాధా రవి యాదవ్ తల్లి స్వర్గీయ బొల్ల బోయిన కేతమ్మ అనారోగ్యంతో మృతిచెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు పరామర్శించారు. కుటుంబ సభ్యులు సంపత్ తదితరులను పరామర్శించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జూపక భాస్కర్ , కూస కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
previous post