జై భారత్ వాయిస్ జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ జుక్కల్ నియోజకవర్గం పౌరులంతా ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని అందిపుచ్చుకొని నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని లాడేగాం గ్రామ పెద్దలు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ జుక్కల్ మండలంలో గల లాడేగాంలో ఆదివారం నాడు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం చేసిన సమావేశంలో గ్రామ పెద్దలు మాట్లాడారు. శివాజీ యుద్ధ నైపుణ్యం, పరిపాలన ఆదర్శమని కొనియాడారు. ధైర్యసాహసాలకు మారు పేరు ఛత్రపతి శివాజీ అని గుర్తుచేశారు. మత సామరస్యాన్ని చాటారని తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరీ కృషి ఉందని పేర్కొన్నారు. ప్రజలే ప్రభువులుగా పాలన సాగిందన్నారు. శివాజీ ఎన్నో యుద్ధాలు చేసినా హింసను ప్రోత్సహించలేదన్నారు. పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదన్నారు. కార్యక్రమంలో శివాజీ పటేల్, రాజశేఖర్ పటేల్, తానాజీ పటేల్, ప్రశాంత్ పటేల్, కునాల్ పటేల్, అజింక్ పటేల్ విష్ణు, బాలాజీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
previous post