Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

పండుగ వాతావరణం లో పింఛన్లు పంపిణీ

A

పెంచిన పింఛన్ అవ్వాతాతలకు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ

ఎమ్మెల్యే అమిలినేనికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పింఛన్ దారులు

జై భారత వాయిస్, కుందుర్పి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు ఆశయం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని భావించి ప్రజలకు అండగా ఉండాలని వారి కష్ట సుఖాల్లో తోడు ఉండాలాని భావించి మొదటి సారి పింఛన్ అందించారని అదే స్ఫూర్తితో నేడు తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేటి ఉదయం నుంచి పెంచిన పింఛన్ మొత్తం మూడు నెలలది 3000 రూపాయలు, ప్రస్తుత పింఛన్ 4000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబగుంపుల, బెస్తరపల్లి గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ నియోజకవర్గంలోని రోడ్లు, బీటీపీ కాలువతో పాటు కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Related posts

అంతర్జాతీయ జూనోసీస్ దినోత్సవం

Gangadhar

కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం

Gangadhar

ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలి

Gangadhar