Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

చిన్న సన్న కారు రైతులకే భరోసా పథకాన్ని వర్తింప చేయాలి

చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా పథకం వర్తింప చేయాలి
పెంచికలపేట రైతు సమీక్ష
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు ) : చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని రైతు సమీక్ష సమావేశంలో మెజార్టీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు సోమవారం ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట పిఎసిఎస్ లో రైతుల తో సమీక్ష సమావేశం చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులంతా ఐదు ఎకరాల వరకు సాగు చేస్తున్న చిన్న సహకార రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని రైతులతో జరిగిన సమీక్షలో తెలిపారు. కొంతమంది రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాం లో గుట్టలకు సాగులో లేని కంచెలకు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు వర్తింప చేశారని అది సరైనది కాదని సాగు చేస్తున్న రైతులతో పాటు కౌలు రైతులకు పథకాన్ని వర్తింపజేయాలన్నారు. అలాగే గత ప్రభుత్వంలో రైతుబంధు పథకానికి కేటాయించిన నిధులను ఐదు ఎకరాలలో రైతులకు ఇచ్చి మిగతా నిధులను రైతు సంక్షేమానికి ఖర్చు చేయాలని కొందరు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పండించిన పంటలకు గిట్టుబాటు ధర అదనపు బోనస్, ఎరువులు పనిముట్ల లో సబ్సిడీ ఇవ్వాలని తెలిపారు ఈ సందర్భంగా పీ ఏ సీ ఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి, డిసిఒ నాగేశ్వరావు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పైన రైతుల అభిప్రాయం చేపట్టిందని తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించడం అభినందనీయమన్నారు. రైతుల అభిప్రాయాలను నివేదిక తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ పోతరాజు రాజు ,సీఈఓ లక్ష్మయ్య, డైరెక్టర్లు ఉడుత రాజేందర్, తోట కుమార్ ,తోట చంద్రశేఖర్ ,కోడూరి రమేష్, పిట్టల సూరయ్య ఆర్షం అహల్య ,జిల్లెపెల్లి సుధాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు

Related posts

హనుమకొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

Sambasivarao

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

Jaibharath News

ఆత్మకూరు లో ప్రజా పాలన కార్యక్రమం

Jaibharath News