జై భారత్ వాయిస్ న్యూస్ నూజివీడు
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రారంభం అయిన ఫించన్లు పంపిణీ కార్యక్రమం
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఉదయం 6గంటల నుంచే స్వయంగా పాల్గొని లబ్దిదారుల ఇంటికి వెళ్ళి పెంచిన మొత్తం తో కలిపి ఫించన్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందించారు.ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, టిడిపి జనసేన బిజెపి నాయకుల సమిష్టి భాగస్వామ్యంతో లబ్ధిదారులకు ఫించన్లు ఆయన పంపిణి చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇది. ఎన్నికల హామీల అమలులో భాగంగా పెంచిన ఫించన్లు నేడు లబ్ధిదారులకు అందించటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్సనం. అర్హత ఉంటే కరడుగట్టిన వైసిపి నాయకుడైన సరే ఫించన్ అందిస్తామని అన్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఫించన్లు పొందిన అక్రమార్కులపై చర్యలు చేపడతామని ఎమ్మేల్యే తెలిపారు.
