A
అంతర్జాతీయ జూనోసిస్ దినం –
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
మనుషుల నుండి పశువులకు పశువుల నుండి మనుష్యులకు వ్యాప్తి చెందే వ్యాధులను జూనోసిస్స్ వ్యాధులు అంటారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో 6 వ తేదీన ప్రపంచ జునోసిస్ దినంగా జరుపుకుంటారు.ఈ సందర్భంగా ఏరియా పశు వైద్యశాల, కళ్యాణదుర్గం నందు ఉదయం 9 గంటలకు నాటు కుక్కలు జాతి కుక్కలకు పిచ్చి కుక్క జబ్బు (రేబిస్ వ్యాధి) టీకాలు ఉచితంగా వేయబడునని డాక్టర్ యన్ శ్రీనివాస గుప్త, సహయ సంచాలకులు, ఏరియా పశు వైద్యశాల, కళ్యాణదుర్గం తెలిపారు.
జూనోటిక్ వ్యాధులు ముఖ్యంగా రేబీస్ వ్యాధి, క్షయ వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి, బర్డ్ ఫ్లూ వ్యాధి, దొమ్మవ్యాధి, లెప్టోస్పైరోసిస్ వ్యాధి, ఏకినోకాకోసిస్ వ్యాధి, సార్స్ వ్యాధి, మెదడువాపువ్యాధి, కరోనా వ్యాధి మున్నగునవి చెప్పవచ్చును. కావున ఈ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించ బడునని తెలిపారు.