జై భారత్ వాయిస్ వరంగల్
కాకతీయ ఇలవేల్పు వరంగల్ ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో శాకంభరి నవరాత్రుల ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి భద్రకాళి ప్రారంభిచారు.కుటంబ సమేతంగా అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
శాకాంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే అన్న పానీయాలు సమృద్ధిగా లభిస్తాయని శ్రీ భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు శేషు అన్నారు. ఓరుగల్లు వాసులు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పూర్వం 100 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ప్రజలు అల్లాడుతుంటే అమ్మవారు తన దేహం నుండి పండ్లు కూరగాయలు అందించి కరువును మాపింది అప్పటినుండి ఆషాడశుద్ధ మాసంలో అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని,15 రోజులపాటు జరగనున్న శాకాంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకోవాలని మొదటి రోజు అమ్మవారిని కాళీ క్రమంలో అలంకరించడం జరిగిందని, కాళీ క్రమంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు
previous post