పదవులు లేకున్నా సమాజ సేవకు అంకితం కావాలి
– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డ
– ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ప్రజా ప్రతినిధులు, నాయకులు పదవులు ఉన్నా లేకున్నా సమాజ సేవ కోసం అంకితభావంతో పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల వీడ్కోలు సమావేశానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా మండల ప్రజలకు అనేక సేవలు అందించిన ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ , జడ్పిటిసి కక్కెర్ల రాధిక రాజు గౌడ్, జిల్లా ఎంపీటీసీల ఫోరం నాయకులు బొమ్మగాని భాగ్య రవి గౌడ్, మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షులు ఆర్షం వరుణ్ గాంధీ, ఎంపీటీసీలు భయ్యా రమా రాజ్, పోగుల ఇందిరా, మందపల్లి మమత, లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు అందించారని తెలిపారు. ఐదు సంవత్సరాల పాటు మండల ప్రజలకు సేవలు అందించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన కొనియాడారు. పదవులు ఉన్నా లేకున్నా కూడా సమాజ అభివృద్ధికి అంకితం కావాలని చెప్పారు. యువతతోనే సమాజ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు ఉంటుందన్నారు. పదవుల కాలం ముగిసిపోయిందని ఇంట్లో ఉండకుండా ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.మీరు చేసిన సేవలను గుర్తించిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో మీకు మళ్ళీ అవకాశాన్ని ఇస్తారని ఎవరు అధైర్య పడవద్దు అన్నారు. ప్రజలు మళ్ళీ మీకు అవకాశాన్ని ఇస్తారని ప్రజా సేవ చేసి మీ జన్మ ధన్యం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీపీ బీరం సునంద సుధాకర్ రెడ్డి, ఎంపీవో చేతన్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, మండల కిసాన్ రైతు అధ్యక్షులు రేవూరు జయపాల్ రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి అంకుష్, అధికారులు నాయకులు పాల్గొన్నారు