ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఏలూరుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రావడం జరిగింది. ఉదయం 10:30 లకు గన్నవరం విమానాశ్రయంకు చేసుకున్న ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారికి స్థానిక 7 నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరు కూడా వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. మొదట హనుమాన్ జంక్షన్ లో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం, హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరుకు ర్యాలిగా వెళ్లడం జరిగింది. ఏలూరులోని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఏలూరు పార్లమెంట్ 7 నియోజకవర్గల నుండి అధిక సంఖ్యలో ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారికి స్వాగతం పలకడం కోసం తరలివచ్చిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలకు వారు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.