A
చెప్పు జారిందని ఒకరు.
వారిని కాపాడటానికి వెళ్లి ఒకరు
ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు
జై భారత వాయిస్ కుందుర్పి
కుందుర్పి మండల కేంద్రం నందు ఉన్న ZPH స్కూల్లో చదువుతున్న 1.విష్ణు, వయస్సు 11 సం,. 6 వ తరగతి, Z. P. H. S స్కూల్ .తండ్రి సజ్జల అంగడి నాగేంద్ర, కుందుర్పి(V&M) అను విద్యార్థి ఇంటర్వెల్ వదిలినప్పుడు బహిర్ బావకి పోయి పక్కనే ఉన్న చెరువు కుంటలు చెప్పు జారిందని తీసుకోవడానికి పోయి అందులో పడినాడు. అక్కడే దగ్గరలో ఉన్నకంసాల నవీన్, వయస్సు 25 సం., లు, తండ్రి రామాచారి, కుందుర్పి(v&M).పెళ్లి కాలేదు గమనించిన ఆ విద్యార్థిని కాపాడడానికి పోయి ఇతను కూడా ఊబిలో ఇరుక్కుని చని పోయినాడు. మిగిలిన విద్యార్థులు వెంటనే అక్కడ ఉన్న స్కూల్ టీచర్ చెప్పడం వల్ల టీచర్లు గ్రామస్తులు పోయి చూడగా నవీన్ చనిపోయినాడు, కొన ఊపిరితో ఉన్న విష్ణును హాస్పిటల్లో చేర్పించడం జరిగింది చికిత్స పొందుతూ మృతి. చెందాడు,