కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కాసుల బాలరాజు నేడు హైదరాబాద్ లోని లక్డి కపూల్ లో ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు..ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని కాసుల బాలరాజు కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం బాలరాజు ఎంతో శ్రమించారని ఎమ్మెల్యే తోట పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెత్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.