(జై భారత్ వాయిస్ వరంగల్ ) మన మహోత్సవంలోఅందరి భాగ్యస్వామ్యంతో విరివిగా మొక్కలు నాటి జిల్లాను అగ్రగామిగా నిలబెడదామని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మాత్రి కొండ సురేఖ పిలుపునిచ్చారు.వనమహోత్సవం వజ్రోత్సవం లో భాగంగా వరంగల్ మహానగరక పాలక సంస్థ, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వరంగల్ పట్టణంలోని లేబర్ కాలనీ ఈ ఎస్ ఐ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ లతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఇంటింటికి మొక్కలు నాటుటకు గాను మంత్రివర్యులు మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితం అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేయం మున్షి వనోమ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు., అప్పటి నుండి ప్రతి సంవత్సరం జులై మొదటి వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు.

పచ్చదనం పెంచడంలో ప్రజలను ప్రోత్సహించి మొక్కలు నాటడంలో భాగ్య స్వాములు చేస్తూ పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద వృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.గత నెల 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వన మహోత్సవం వజ్రోత్సవ లోగో ఆవిష్కరించి ఈ కార్యక్రమానికి మన జిల్లా నుండే శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం 20 కోట్ల మొక్కలు లక్ష్యం, జిల్లా లక్ష్యం 24 లక్షలు కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం జిల్లా మొక్కలు నాటడంలో రెండో స్థానంలో ఉందని, ప్రథమ స్థానానికి చేరుటకు కృషి చేయాలన్నారు. రావి, వెదురు, మర్రి, చిందుగా నేరేడు, ఉసిరి, చింతా, వేప మొదలగు 12 ఫీట్ల ఎత్తుగల మొక్కలను పంపిణీ చేయడం జరుగుతున్నదని అన్నారు. రైతులకు శాండల్ వుడ్ వెదురు ఈత ఆగ్రో ఫారెస్ట్రీ కింద పెంచుకొనుటకు మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు.ఆలోచన బాగా ఉన్నా ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవని,నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోతులు అడవులకు పోవాలంటే అడవిలో పండ్ల మొక్కలు విరివిగా నాటాలని అడవి శాఖ అధికారులకు దేశాలు జారీ చేశామని మంత్రి ఆన్నారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు మానవునికి కూడా ముప్పు వాటిల్లుతుందని, ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలించడంలో మార్పు స్వయంగా మన నుండే రావాలని, వివిధ వాణిజ్య దుకాణాల యజమానులతో సమావేశమై ప్లాస్టిక్ నియంత్రణ పట్ల వారిని జాగృతం చేసి అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలో గ్రేటర్ వరంగల్ పరిధిలో యువకులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను కోరారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు నేడు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. గత మార్చి నెలలో మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరంగల్ పట్టణంలో లక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని 12 ఫీట్ల ఎత్తు గల మొక్కలను పంపిణీ చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియని, చెట్లు నీడనిచడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయన్నారు. బర్త్డే ఈవెంట్ల సందర్భంగా ఇళ్లలో పిల్లలచే మొక్కలు నాటించేలా చిన్నప్పటి నుండే అలవాటు చేయించాలన్నారు.

గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో సెంట్రల్ మీడియన్, అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ , ప్రభుత్వ ఖాళీ స్థలాలలో, చెరువులు, కుంటలలో పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆక్రమణకు గురి కాకుండా ప్రణాళిక బద్దంగా మొక్కలు నాటడం చేపడుతున్నట్లు తెలిపారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ వజ్రోత్సవం వనమహోత్సవం కార్యక్రమం గత 75 సంవత్సరాలుగా చేస్తున్నామని, ఇది ఒక నిర్విరామమైన యజ్ఞం అన్నారు. మొక్కల ప్రాముఖ్యత జీవన విధానం మా భారతీయ సంస్కృతిలో ఉందని, ఈ యజ్ఞాన్ని ఇలాగే కొనసాగిస్తూ వృక్ష సంపదను పెంచుతూ బయోడైవర్సిటీ పెంచుతూ, పర్యావరణ కాలుష్య సమస్యలు అధిగమిస్తూ సుఖంగా జీవనం సాగాలని ఆకాంక్షించారు. అంతకు ముందు మంత్రి , మేయర్, కలెక్టర్, డిఎఫ్ ఓ, కమిషనర్ అందరితో కలిసి వన మహోత్సవ ప్రతిజ్ఞ చేశారు.జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్, డిఎఫ్ ఓ ప్రసంగించినఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు, సురేష్ జోషి, మరుపల్ల రవి, రామ టీజస్వి శిరీష్, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ కృష్ణవేణి, బల్దియా, అటవీ, ఈఎస్ఐ ఆసుపత్రి అధికారులు, మెప్మా అధికారులు, ఆర్పీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.