నూజివీడు :11-7-2024
నేటి నుండి నిత్యవసర సరుకులు సరసమైన ధరలకే పంపిణీ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి.
నూజివీడు పట్టణంలో గల రైతు బజారు నందు ప్రత్యేక కౌంటర్లో నిత్యవసర సరుకులు అతి సవక ధరలకే లభించునని తెలియజేసిన మంత్రివర్యులు కొలుసు పార్ధ సారథి మంత్రివర్యులు రైతు బజారునందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించి ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేసారు ప్రారంభించిన తదనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ ప్రత్యేక కౌంటర్లో కంది పప్పు 170 రూపాయలకే లభించునని మంచి రకం బియ్యం 48 రూపాయలకే లభించునని అలాగే ప్రతీ నిత్యవసర సరుకులు సరసమైన ధరలకే లభించునని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు గత 6 నెలలనుండి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని దాన్ని అరికట్టి సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే సరుకులు అందించాలనే సంకల్పంతో పౌరసరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆలోసించి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన తదనంతరం రైతు బజారుల్లో ఈ ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రివర్యులు తెలిపారు మంత్రివర్యులు మార్కెట్ యార్డు నందు గల దుకాణాలను పరిశీలించి దుకాణదారుల ఇబ్బందులను అడిగి స్వయంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు దుకాణ యజమానులు మంత్రివర్యుల దృష్ఠికి తీసుకొచ్చిన సమస్యల్లో ముక్యంగా శానిటేషన్ శుభ్రంగా లేదని రేకు షెడ్లు పాడైపోయి వర్షం కురిసి ఇబ్బంది పడుతున్నామని మరియు అద్దెలు కొంచెం తగ్గించాలని టాయిలెట్స్ కట్టించాలని కోరగా మంత్రివర్యులు వెంటనే స్పందించి శానిటేషన్ ఇన్స్పెక్టర్కు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు రానున్న 6 మాసాల్లో మొత్తం ఇబ్బందులన్ని తొలగించి అదునుతనమైన రైతు బజారు ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు వెంట మున్సిపల్ సిబ్బంది డి, ఎస్, ఓ, రెవిన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు
