జై భారత్ వాయిస్ హన్మకొండ
మత్తు పదార్థాల నుండి యువతను కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ట్రై సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగం జరిగే ప్రాంతాల వివరాలను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు ఇప్పటి వరంగల్ గంజాయికి సంబంధించి నమోదయిన కేసులు, పట్టుబడిన స్మగ్లర్లు, గంజాయి వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ల వారిగా అడిగి తెలుసుకోవడంతో పాటు గంజాయి కట్టడికై తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాల బారిన పడి ఎంతోమంది యువత భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారిందని. యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని. ఇలాంటి యువత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో ఇతర మత్తు పదార్థాలను గతంలో విక్రయాలు, రవాణా కు పాల్పడిన నేరస్తులతో పాటు, మత్తు పదార్థాలను వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతో వారిపై నిరంతరం నిఘా కొనసాగించాలని. గంజాయి నియంత్రణ కై నార్కోటిక్ విభాగం అధికారుల సహకారం తీసుకోవాలని. మనందరం సమన్వంతో పనిచేస్తూ భవిష్యత్తులో వరంగల్ కమిషనరేట్ ను గంజాయి రహిత కమిషనరేట్ గా మారుద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ లు జితేందర్ రెడ్డి, మధుసూదన్, సైదులు, దేవేందర్ రెడ్డి, తిరుపతి, భీమ్ శర్మ,, తిరుమల్ డేవిడ్ రాజుతో పాటు ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐ లు, నార్కోటిక్, సిసిఆర్బి, అధికారులు పాల్గొన్నారు.