పెదపాడు మండలం వట్లూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక తరగతులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు.మాతృభూమి పట్ల, సామాజిక సేవల పట్ల తెలుగు ఎన్నారై లకు ఉన్న సేవా భావం ఎంతో అభినందనీయమని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు.పెదపాడు మండలం వట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకు మెరుగైన డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATA) చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షులు మదన్ పాములపాటి, ఉపాధ్యక్షులు భాను ప్రకాష్ ధూళిపాళ్ల సంయుక్త ఆధ్వర్యంలో బహుకరించబడిన సుమారు రూ.3లక్షల రూపాయల విలువ గల 10 కంప్యూటర్స్, డిజిటల్ విద్యా పరికరాలతో ఏర్పాటైన డిజిటల్ తరగతి గదులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు..ముందుగా వట్లూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్థానిక కూటమి నాయకులు, హైస్కూల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కను నాటారు.ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని, ప్రతి ఒక్క విద్యార్థి అకుంఠిత దీక్షతో విద్యను అభ్యసించి ఉత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల డిజిటల్ విద్య కోసం ఎంతో సేవా భావంతో కంప్యూటర్లు బహుకరించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందించారు..ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం, టిడిపి నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్, కొమ్మన లక్ష్మణ మోహన్,కొమ్మన శ్రీధర్,సాంబశివరావు,గుత్తా అనిల్,అక్కినేని వంశీ,కొత్తూరు చినబాబు,ఎంపిడిఓ తేజ రతన్, మండల విద్యాశాఖ అధికారులు సబ్బితి నరసింహ మూర్తి, డి వి రమణ,తదితరులు పాల్గొన్నారు.
