జై భారత్ వాయిస్ గన్నవరం
గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ కమిటీ సభ్యులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు,ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని. సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూగన్నవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయ టెర్మినల్ పనులు గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యంమని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయకపోవడం దారుణమని అన్నారు.రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎయిర్ పోర్టు టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతామని హమీనిచ్చారు.పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలి అంతేగాని గత వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎయిర్ పోర్టు పనులను నిలిపివేసి చోద్యం చూశారిని అన్నారు. మా ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం 9 నెలలోనే ఎయిర్ పోర్టు అంతర్జాతీయ టెర్మినల్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం..ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ టెర్మినల్ పనులు సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ*గత ప్రభుత్వం లో ఎయిర్పోర్టులో అభివృద్ధి శూన్యమని .వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అభివృద్ధిని గాలికి వదిలేసి మేన మేషాలు లెక్కించారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధికి నావంతు కృషి చేస్తామన్నారు. గన్నవరంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ క్యారీడర్, ఎయిర్ పోర్టు వద్ద ఐ టి తీసుకువచ్చి అభివృద్ధి చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.ఎన్డీఏ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు తో మాట్లాడి గన్నవరాన్ని అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హమీనిచ్చారు

previous post