Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం

(జై భారత్ వాయిస్ వరంగల్ :- రిపోర్టర్ జ్యోతి)
కాకతీయ కాలం నాటి ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం వరంగల్ జిల్లాలో వెలసిఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాఖంబరి ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందుగా అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం అమ్మవారిని ఉగ్రా క్రమం ( అలంకరణలో) భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. భద్రకాళీ శరణం మమ అంటూ భక్తులు చేసిన నామస్మరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణం మార్మోగింది.అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్ లతో పాటు తాగునీటి వసతిని ఉచిత అన్నదాన ప్రసాద వితరణ అవకాశం కల్పించారు.

Related posts

దయాకర్ జ్ఞాపకార్థం  విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ

కేటీఆర్ పర్యటనతో  ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు. వరంగల్ పోలీస్ కమిషనర్ .రంగనాథ్

స్నేహితుడి కుటుంబానికి చేయూత