జై భారత్ వాయిస్ న్యూస్ ఏలూరు:జూలై 13 : ఏలూరు జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వార్డుల్లో నెలకొన్న దోమలు, అపరిశుభ్రతపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రోగులను పరామర్శించి, బాగోగులు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ని పిలిచి వారం రోజుల్లో ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచాలన్నారు. ఆస్పత్రికి కావలసిన అన్నిరకాల వైద్యపరికరాల వివారాలు, అంచనా వ్యయం శాంతీనగర్ లోని ఎంపీ కార్యాలయంలో అందజేయాలన్నారు.