Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జూలై 15న  వరంగల్ లో శ్రీ జగన్నాథ రథ యాత్ర jaganatha Rathayatra

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ మహానగరంలో జులై 15 సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇస్కాన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాధుడి రథ యాత్ర  నిర్వహిస్తున్నామని ఈ రథ యాత్రలోని పాల్గొని జగన్నాధుని కృపకు పాత్రులు కాగలరని ఇస్కాన్ టెంపుల్ కోర్డినేటర్ దమేశ్వర ధర్మేంద్ర దాస్, భూపావన హరినామా దాస్ లు తెలిపారు.హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుండి యాత్ర ప్రారంభం అయ్యి  హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్, ఎంజిఎం హాస్పిటల్, పోచమ్మ మైదాన్ మీదగా వెళ్లి తిరిగి ములుగురోడ్ లోని వెంకటేశ్వర గార్డెన్ కు చేరుకొని అక్కడ అతిధుల ప్రసంగాలు, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు.  ఈ రథ యాత్రలో వరంగల్ ట్రై సిటీ ప్రజలు పాల్గొనాలని, ఇస్కాన్ భక్తులతో పాటు జగన్నాధుని కృపకోసం  ఎదురు చేసే భక్తులందరికి  ఇది మంచి  సువర్ణ అవకాశమని తెలిపారు ఈ యాత్రలో పాల్గొని రథం లాగిన, దర్శించుకున్న, ప్రసాదాలు స్వీకరించిన జగన్నాధ ప్రభు ఆశీస్సులు ఉంటాయని  తెలిపారు. రథ యాత్రలో భక్తులకు  మంచినీళ్లు, ప్రసాదాలు అందిస్తాం అని తెలియజేసారు..


Related posts

హెచ్ జీ లకు మహిళా శక్తి పథకం పై అవగాహన కల్పించండి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు

Jaibharath News

పిల్లలకు పోషకాహారం అందించాలి