Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ఘనంగా కైకలూరు లో ప్రజాప్రతినిధుల అభినందన సభ.

కైకలూరు: జూలై 14:జై భారత్ వాయిస్ ‘  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, కైకలూరు ఎమ్మెల్యే డా! కామినేని శ్రీనివాస్ ల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ కేంద్రం నుండి జల్ జీవన్ పధకం ద్వారా నిధులు మంజూరు చేయించి కైకలూరులో త్రాగునీటి సమస్య పరిష్కారిస్తానని, కొల్లేరు పక్షుల సంరక్షణ, అందమైన పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, త్వరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఏలూరు లో వందేభారత్ రైలు స్టాపు ఏర్పాటుకు కేంద్రం తో మాట్లాడటం జరిగింది త్వరలో ఏలూరులో వందే భారత్ రైలు ఆగుతుంది అని తెలిపారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైను ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తున్నానన్నారు. చదువుతున్న యువతకు తరచుగా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. ఏలూరు లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని కేంద్ర నిధులతో ఆధునికరిస్తానన్నారు. ఎంపీ లాడ్స్ నిధులతో నాయీబ్రాహ్మణులకు, బిసీ లకు కల్యాణ మండపాలు నిర్మిస్తామన్నారు. పామాయిల్ రైతులకు టన్నుకు మద్దతు ధర 17,000/- సాధిస్తానని మహేష్ కుమార్ గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి , గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి   రవీంద్ర , మాజీ యంఎల్సీ కమ్మిలి విఠల్, మాజీ యంఎల్ఎ లు ఘంటా మురళీ రామకృష్ణ, వెంకటేశ్వర రావు, వేలాదిగా కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు, అంతకు ముందు కైకలూరు ప్రధాన రహదారుల్లో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Related posts

నారా చంద్రబాబు దయవలనే చిరకాల స్వప్నం నెరవేరింది నూజివీడు ఎమ్, ఆర్, పి, ఎస్. నాయకులు..

KATURI DURGAPRASAD

గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తాం..

KATURI DURGAPRASAD

వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.. కొలుసు పార్థసారథి

KATURI DURGAPRASAD