Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ఉంగుటూరు లో పర్యటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 

ఉంగుటూరు: జూలై 14 : ఏలూరు పార్లమెంట్ సభ్యులు   పుట్టా మహేష్ కుమార్  ఉంగుటూరు నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటించారు. తొలుత ఏలూరు తెలుగుదేశం జిల్లా అద్యక్షులు గన్ని వీరాంజనేయులు గారిని భీమడోలు మండలంలోని వారి కార్యాలయంలో కలసి సంస్థాగత విషయాలను చర్చించారు. అనంతరం ఉంగుటూరు మండలం,

నారాయణపురం లోని ఉంగుటూరు ఎమ్మెల్యే  పత్సమట్ల ధర్మరాజుని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి నియోజకవర్గ అభివృద్ది పై సమీక్ష జరిపారు. తదుపరి చల్లమ్మ తల్లి  భద్రకాళి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఉంగుటూరు మండలం, పెద్దవెలమెల్లి గ్రామంలో 7 కోట్లతో నిర్మిస్తున్న ఆర్ డబ్యు ఎస్ వాటర్ ట్యాంకు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ 7 కోట్ల 10 లక్షలతో 12 వాటర్ హెడ్ ట్యాంకులు, 37 కిలోమీటర్లు పైప్ లైన్స్ నిర్మాణం, 4 బోర్ సెట్లు నిర్మాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేధర్మరాజు , ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు  గన్ని వీరాంజనేయులు , స్థానిక జడ్పీటీసీ, ఎంపిపి, ఎంపీటీసీ, సర్పంచ్ మరియు వందలాదిగా స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాలుగోన్నారు

Related posts

*హాస్టల్ కు ఫ్యాన్లు ఏర్పాటు చేసిన మంత్రి పార్థసారథి

KATURI DURGAPRASAD

చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు: మంత్రి కొలుసు పార్థసారథి