జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రాల గ్రామాలలో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినదని మండల వైద్యాధికారి డాక్టర్ అర్చన తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన గ్రామాల ప్రజలకు వివరించడం జరిగింది. ఈ వైద్య శిబిరము నందు జ్వరంతో పాటు ఇతర ఇబ్బందులు ఉన్న గ్రామాల ప్రజలకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో అన్ని ఉప కేంద్రాల డాక్టర్లు, సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి, సూపర్వైజర్లు కిరణ్ కుమార్, స్వరూప ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
previous post
next post