రిపొర్టర్:అశొక్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణ మాఫీ హామీని కేవలం ఏడు నెలల్లోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం రుణమాఫీ సంబరాల్లో భాగంగా మండలంలోని హౌస్ బూ జూర్గ్ గ్రామంలో ఎడ్ల బండి పై సవారీ చేసిన ఎమ్మెల్యే అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో బైక్ భారీ ర్యాలీ ని నీరుకుల్ల,
పెంచికలపేట, కామారం ,పెద్దాపురం, లింగం మడుగు పల్లి అక్కంపేట చౌలపల్లి తదితర గ్రామాల్లో నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి న కాంగ్రెస్ నాయకులుబాణ సంచాలు కాల్చి జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే 6 గ్యారంటీ లైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకుఉచిత బస్సు ప్రయాణం 5 వందలకే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత కరెంటు 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ భీమ పెంపు నియోజకవర్గానికి 3000 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు త్వరలో మంజూరు వంటి హామీలను నెరవేరుస్తూ వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అలాగే రైతన్నలకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేసిన ఘనత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి లకే దక్కుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 2018 రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని ఇప్పుడు అప్పుడు అని చెప్పి రైతులను మోసం చేసిందని రేవూరి విమర్శించారు.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కాలంలో కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణరాష్ట్రాన్ని చిన్నా బిన్నం చేశారని మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానని పలికారని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రేవూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పి ఎస్ సి ఎస్ చైర్మన్ బీరం సుధాకర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కక్కేర్ల రాధిక రాజు, మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ ఆత్మకూరు మాజీసర్పంచ్ పర్వతగిరి రాజు, పరికరాల వాసు, బరుపట్ల కిరీటి మాజీ వైస్ ఎంపీపీ ముద్ధం సాంబయ్య , పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్ తిరుపతి, రేవురి జయపాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.