Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

సిపిఐ సీనియర్ నాయకుడు పి లక్ష్మన్న మృతి

కుందుర్పి గ్రామ సిపిఐ సీనియర్ నాయకుడు పి, లక్ష్మన్న మృతి

జై భారత్ వాయిస్, కుందుర్పి

మండల కేంద్రంమైన కుందుర్పి గ్రామానికి చెందిన  లక్ష్మన్న , కళ్యాణదుర్గం తాలూకా సిపిఐ సీనియర్ నాయకుడు, విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు, ఎస్, టి, యు, సీనియర్ నాయకులు, వైస్ ,ఎంపీపీ, శుక్రవారం ఉదయం  నిమిషాలకు గృహంలో మృతి చెందారు. ఆయన అనారోగ్యానికి గురై ఒక సంవత్సరంగా మంచానకే పరిమితమైన విషయం విదితమే. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు , ముగ్గురు కుమార్తెలు కలరు. మృతుడి స్వగృహంలో ఎస్, టి, యు ,యూనియన్, ఉపాధ్యాయులు, సిపిఐ నాయకులు, గ్రామ ప్రజలు సందర్శించి మృతుడి భౌతికాయం పైన పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. మృతుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడ వున్నా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని వారు ప్రార్థించారు. పేద ప్రజల సమస్యల పరిష్కార కోసం అనేక రాజిలేని పోరాటం చేసిన ఘనత చెల్లు. ఆయన నిబద్ధతకు అంకితభావానికి ప్రతిరూపంగా నిలిచిన సిపిఐ పార్టీ అభివృద్ధి కోసం సొంత నిధులను వెచ్చించిన త్యాగశీలి. ఆయన సిపిఐ పార్టీకి, ఉపాధ్యాయులకు, చేరవేసిన సేవలు చిరస్మరణీయం అని వక్తలు కొనియాడారు.

Related posts

అంతర్జాతీయ జూనోసీస్ దినోత్సవం

Gangadhar

ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ధర్నా

Jaibharath News

టిడిపి పార్టీలో రెండు వర్గాలు ఒకటయ్యాయి

Jaibharath News