మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం చెరువులో ఓ మత్స్యకారుడి వలకు 32 కిలోల భారీ చేప చిక్కింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నుంచి పెద్ద చేపలు వాగులోకి ఎదురు వెళ్తున్నాయి. పిల్లి సతీష్ అనే మత్స్యకారుడు చెరువులోకి వాగు నీరు చేరే చోట వల ఏర్పాటు వేశాడు. వల ఎంతకూ రాకపోవడంతో ఇతరుల సాయంతో వలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో 32 కిలోల పెద్ద చేప చిక్కడంతో సతీష్ ఆనందం వ్యక్తం చేశారు.
