జై భారత్ వాయిస్ నూజివీడు : జులై, 21
ఆగిరపల్లి మండలం ఈదర గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ పంగిడమ్మ బోనాల జాతర మహోత్సవంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమ్మ వారికి పట్టు వస్త్రాలు మొక్కులు సమర్పించినారు.ఆదివారం మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. మంత్రికి పూర్ణ కుంభంతో మేళ తాళాలతో ఆలయ అర్చకులు కమిటీ సభ్యుల బృందం <span;>ఘన స్వాగతం పలికారు .మొక్కులు చెల్లించిన తదనంతరం మంత్రి పార్థసారధి మాట్లాడుతూ అమ్మవారు ఎంతో విశిష్టత కల్గిన తల్లి అని కోరిన కోర్కెలు వెంటనే తీర్చే తల్లి అని అన్నారు అమ్మ వారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆ తల్లిని కోరామని తెలిపారు.ఈ గ్రామ ప్రజలంతా పాడి పంటలు బాగా పండి సుఖ సంతోషాలతో వర్థిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి అన్నారు. అమ్మవారి గుడి అభివృద్ధికి 5 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు అమ్మవారి దయ కరుణా కటాక్షం మా ప్రభుత్వం పై ఉండి వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు విరివిగా పండి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారని ప్రార్ధించానని తెలిపారు అమ్మవారిని గ్రామ ప్రజలంతా దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు అమ్మ వారి దీవెనలు పొందాలని కోరారు .ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు గ్రామ పెద్దలు పార్టీ నాయకులు అలయ కమిటి సభ్యులు గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.