రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిందని ఆత్మకూరు పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ అన్నారు. ఆదివారం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని అభినందనలు తెలియజేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి లు రైతుల పట్ల కృత నిశ్చయంతో ఉండి ఏ ఆపద వచ్చినా మీకు మేము ఉన్నామంటూ రైతుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడం అభినందనీయమన్నారు. నాడు వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు జిల్లాలోని అన్ని పిఎసిఎస్ చైర్మన్లు రైతులకు రుణాలు కావాలని అడిగిందే తడవుగా ప్రతి రైతుకు రుణం అందించే విధంగా రుణాలు జారీ చేశారని అవన్నీ నేడు రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాలో పడ్డాయి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మార్నేని రవీందర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ జరిగిందని దీంతో రైతులు ఆనందం వెలిబుస్తున్నారని తెలిపారు. రుణమాఫీ పొందిన రైతులతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతు ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా డిసీసీబీ బ్యాంకులో రైతు రుణాలు పొందవచ్చని సూచించారు