Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి మృతిపై సంతాప సభ

జై భారత్ వాయిస్ హన్మకొండ
హన్మకొండ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీకాం తెలుగు మీడియం, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భూక్య శివలాల్ శనివారం రాత్రి మృతి చెందడం పై కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి కళాశాల ఆవరణలో సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా గార్ల లోని పూసల తండాకు చెందిన పేద విద్యార్థి భూక్య శివలాల్ అనారోగ్య కారణంగా మృతి చెందడం చాలా బాధాకరమని అతని కుటుంబానికి కళాశాల తరఫున సంతాపం తెలుపుతున్నామని, అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పుల్లా రమేష్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే సరియైన అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని, ప్రతి విద్యార్థి వర్షాకాల పరిస్థితుల వల్ల ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాలలోని తన తోటి కామర్స్ విభాగ విద్యార్థిని, విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయుటకు ముందుకు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్  అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్ బాబు, విభాగ అధ్యాపకులు, కళాశాల అధ్యాపకులందరూ, అన్ని విభాగాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Related posts

What’s The Difference Between Vegan And Vegetarian?

Jaibharath News

Photo Exhibit Puts Talents, Emotion On Display

Jaibharath News

UPS Will Use VR Headsets To Train Student Drivers To Avoid Traffic

Jaibharath News