Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

మత్తు పదార్థాలకు బానిస కావద్దు: రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలి అని కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత అన్నారు, బుధువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగంఫై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అధితిగా హాజరు అయ్యారు. ఆర్డిఒ మాట్లాడుతూ యువత,విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం వలన భవిష్యత్తు తరాల్లో ఎలాంటి సంఘటనలు సంభవిస్తాయో అనే అంశాలఫై కులాంకుశంగా వివరించారు. ప్రిన్సిపాల్ మల్లికార్జున మాటాడుతు విదేశిసంస్కృతులకు ఆకర్షతులై చెడు వ్యసనాలకు బానిస కావడం జరుగుతుందని అన్నారు, కుటుంబ సమస్యలపై కలత చెంది మత్తు పదార్థాలకు వ్యసనంగా మారడం, భవిష్యత్తలో చాలా తప్పిదాలకు దారి తీస్తుందని అన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ మాటాడుతు కుటుంబంలోని తల్లి దండ్రులతో సఖ్యతగా మెలిగి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకోనిరావాలని అన్నారు, అధ్యాపకులు జగన్నాథ్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేష్ బాబు మాటాడుతు విద్యార్థులు మంచి విద్య, బోధనలతో భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలనే బాధ్యత విద్యార్థుల మీద ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మురుగు కాలువ నీటిని పరిశుభ్రం చేయండి

Gangadhar

ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫర్ లోని రాగి వైరు ధ్వంసం చేశారు

Jaibharath News

ఎన్నికల కమిషన్ నిబంధనలను విమర్శించిన స్టాప్ నర్స్

Jaibharath News