Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

జియో ఎర్టెల్ వొడ ఫోన్ వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు

టెలికం మొబైల్ వినియోగదారులకు ప్రైవేట్ టెలికం నెట్ వర్కు కంపెనీలు జియో, ఎర్టెల్, వొడఫోన్ కంపెనీలు తమ టారీఫ్ ఒక్కసారిగా పెంచడంతో వినియోగదారులుకు భారం పడింది. దీంతో ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ సంస్థలో టాపిఫ్ రేట్లు తక్కువ ఉండడంతో సెల్ ఫోన్ యూజర్లు బిఎస్ఎన్ఎల్ వైపు మారుతున్నారు. ప్రైవెట్ టెల్కొలు టారీఫ్ పెంచడంతో దేశం వ్యాప్తంగా ఇప్పటికే రెండు లక్షల యాభైవేల మందికి పైగా యూజర్లు బిఎస్ఎన్ఎల్ వైపు పోర్టు పెట్టుకున్నట్లు సమాచారం అయితే బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో 4జీ సేవలు అందడంలేదు. అగస్టు మాసం 4జీ సేవలు అందించేందుకు యుద్దప్రతిపాదికంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే 12వేల సెల్ టవర్లు నిర్మాణ పనులు చెపట్టారు. 4జ 5జీ సేవలు అందించేందుకు ఇప్పటికే టిసిఎస్, తేజస్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశం వ్యాప్తంగా బిఎస్ఎన్ ఎల్ తమ సేవలను విస్తురించాడాకిని లక్ష పైగా టవర్లను ఇన్ స్టాల్ చేయనున్నట్లు ప్రకటిచింది. ఒక వైపు టవర్లను ఏర్నాటు చేస్తు వినియోగాదారలను పెంచుకొనేందుకు అకర్షణీయ టారీష్ పథకాలు ప్రవేశపెట్టింది. ఇక సిగ్నల్ వ్యవస్థ తక్కువ ఉండడంతో నెట్ వర్కు సమస్యలు ఉన్నాయని వరంగల్ పట్టణంలో కొన్ని ప్రాంతాలలో ఇగ్నల్ రావడం లేదని నూతనంగా ఇతర నెట్ వర్కులనుంచి పోర్టు పెట్టకున్న వినియెగాదారులు నెట్ రావడం లేదని వాపోతున్నారు. మీ పరిసర ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ టవర్లు ఉన్నాయ లేద తెలుసుకొండి ఒవ వేల మీ ప్రాంతంలో టవర్ సిగ్నల్ తక్కువ ప్రిక్వెన్సీలో ఉండి మీకు సిగ్నల్ రాకుండా ఇబ్బందులు పడవల్సీ వస్తుంది. ప్రవేట్ నెట్ వర్కులు 2జి,3జి,4జి అందిస్తునే అడ్వన్స్ గా 5జీ సేవలు అందిస్తూ టెస్టుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో 5జి సేవలు అందిస్తుండగా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4జి సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ వినియెగాదారులకు నాణ్యమైన సిగ్నల్ అందిస్తే నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు మొబైల్ ఫోన్ వినియోగం ఒక మంచి సౌకర్యంగా మారనుంది.

Related posts

మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కి ఎదురుదెబ్బ

Jaibharath News

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి

మోదీతో చంద్రబాబు భేటీ