Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలి

A

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలి,

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం పున: ప్రారంభించాలి. ఏఐఎస్ఎఫ్ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
సిద్ధల వ్యవస్థలో చేరిన హాస్టల్ భవనాలకు నూతన భవనాలు నిర్మించాలి పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలివందలాదిమంది విద్యార్థులతో దద్దరిల్లిన కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఏవో సూరి వినతి పత్రం ఇవ్వడం జరిగిందిఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు హనుమంతరాయుడ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అర్బన్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఏవో సురేష్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంత రాయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని మరియు ప్రభుత్వ జూనియర్కళాశాలచదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పున ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చాలా హాస్టల్లో పాతబడినటువంటి బాంగ్లాలో నిర్వహిస్తున్నారు. వాటికి నూతన భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెనూ ఏమో విపరీతంగా పెంచారు కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచలేదని తక్షణమే మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు హాస్టల్లో కనీసం లైట్లు పోయిన ఫ్యాన్లు లేకపోయినా బాత్రూంలో టాయిలెట్స్ క్లీన్ చేయడానికి అయినా వార్డెన్లు తమ సొంత డబ్బులతో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి మెస్ బిల్లులు హాస్టళ్లకు అందలేదన్నారు కాస్మోటిక్ చార్జీలు నవంబర్ నెల నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదని పేర్కొన్నారు హాస్టల్ విద్యార్థులకు ట్యూటర్లుగా ఉంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం నుంచి వారికి ఇస్తున్నటువంటి జీతాలు చెల్లించలేదని తక్షణమే ట్యూటర్లుగా ఉంటున్న హాస్టళ్లకు జీతాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నవీన్ శైలు స్రవంతి సహాయ కార్యదర్శి అజయ్ పట్టణ అధ్యక్షుడు హర్షవర్ధన్ ఉపాధ్యక్షుడు సాయి పవన్ మని సహాయ కార్యదర్శి శ్రీహరి తదితర విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు

Related posts

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

Jaibharath News

దళితులంటే జైలల్లో మగ్గాల్సిందేనా.? డాబా రమేష్

Jaibharath News

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

Jaibharath News