ఆదాయ పన్ను రిఫండ్ కోసం తప్పుడు వివరాలతో రిటర్న్ సమర్పిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి తెలిపారు. ఆదాయ పన్ను రిటర్న్స్ పై పోలీస్ అధికారులు, సిబ్బందికి జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సమావేశాన్ని శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచనల మేరకు హైదరాబాద్ ప్రధాన కమిషనర్ 1 ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ రెంజ్ 3 హైదరాబాద్ పర్యవేక్షణలో వరంగల్ జిల్లా ఆదాయ పన్ను అధికారి మహేందర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సమావేశంలో ఆదాయ పన్ను అధికారి మాట్లాడుతూ ఇటీవల కాలం ఆదాయ పన్ను చెల్లింపులు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వేతన ఉద్యోగులు తమ ఆదాయ పన్ను వివరాలను సమర్పించే సమయంలో తప్పుడు మినహాయింపులు, డిడక్షన్లతో ఆన్ లైన్ రిటర్న్ సమర్పించి రావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తం లో రిఫండ్ క్లయిమ్ చేస్తున్నట్లుగా ఆదాయ పన్ను విభాగం నిర్వహించిన దర్యాప్తులో వెలుగు చూడటం జరిగింది. ఇదే రీతిలో తప్పుడు సమాచారంతో ఆదాయ పన్ను శాఖలో దరఖాస్తు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విభాగం తరుపున నోటీసులు జారీ చేయడంతో పన్ను చెల్లింపుదారులు తిరిగి వారు ఐటీఆర్ యూ ఫారం ద్వారా పన్ను సవరణ చేసి పన్ను చెల్లిస్తున్నారని ఆదాయ పన్ను అధికారి తెలిపారు. పోలీస్ ఉద్యోగులు ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, అందజేయాల్సిన పత్రాలు, ఇలా తప్పుడు వివరాలతో ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పిస్తే ఆదాయ పన్ను చట్టం క్రింద ఎలాంటి చర్యలు తీసుకోబడుతాయని అలాగే ఎక్కువ మొత్తం లో రిఫండ్ ఇప్పిస్తామంటూ ముందుకు వచ్చే దళారీలను నమ్మవద్దని అధికారులు పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ లు సంజీవ్, సురేష్ కుమార్,. ఎ. ఓ రామకృష్ణ స్వామితో పాటు ఏసీపీ లు ఆర్. ఐ లు, ఇన్స్ స్పెక్టర్లు, ఇతర పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
previous post