జై భారత్ వాయిస్ హన్మకొండ
హన్మకొండ లోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు ఈనెల 31 కల్లా పూర్తి చేయాలని కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం ఆమె అధికారులతో కలసి బాలసముద్రంలో కొనసాగుతున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించి వేగవంతంగా ఫినిషింగ్ పనులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల చివరికల్లా అన్ని స్థాయిల్లోయిల్లో పూర్తయ్యేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుడా పిఓ అజిత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భీమ్రావు, డి ఈ తదితరులు పాల్గొన్నారు.