జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని రైతులు గత సంవత్సరం ఆగస్టు తర్వాత పట్టాదారు పాస్ బుక్స్ కొత్తగా పొందిన రైతులు తెలంగాణ ‘ప్రభుత్వ’ ‘రైతు భీమా’ పొందడానికి, అగస్టు5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని గీసుకొండ మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు రైతులకు సూచించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న భీమా పొందడానికి అర్హతలు, 2024 జూన్ 28 నాటికి పట్టాదారు పాస్ బుక్ పొంది ఊడాలని 14ఆగస్టు 1965 నుండి 2008 14ఆగస్టు లోపు రైతులు జన్మించిన వారు అర్హులని తెలిపారు.ఆధార్ కార్డు లోని వయస్సు ప్రామాణికంగా తీసుకుంటారని రైతులకు భూమి ఎన్ని గ్రామాల్లో ఉన్నా ఒక్క దగ్గరే భీమా పొందే అవకాశం ఊటుందని అన్నారు .రైతుభీమా దరఖాస్తు ఫారంను రైతు స్వయంగా వచ్చి అధికారి ముందు సంతకం చేసి ఇవ్వాలిని పట్టదారు పాస్ బుక్ జిరాక్స్,పట్టాదారు ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డులతో మండల పరిధిలోని ఎరియా వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండలంలోని రైతులు పట్టాదారు పాస్ బుక్ ఉండి మండలంలో భూమి కలిగిఉన్న భీమా చేయించుకోని రైతులు దాదాపు 700 మంది ఉన్నారని. రైతులు గ్రామాల్లో నివసించక పోవడం, ఫోన్ నంబరు సరైనది ఇవ్వకపోవడం, తక్కువ విస్తీర్ణం గల వ్యవసాయ భూమి ఉండడం స్వయంగా వ్యవసాయం చెయ్యకపోవడం లాంటి కారణాల వల్ల స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులును సంప్రదించక పోవడం వల్ల భీమా పాలసీలోకి రావడం లేదన్నారు.అలాంటి రైతులు కూడా వెంటనే గడువులోపు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి 2024 భీమా సంవత్సరంలో నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటికే రైతుభీమా పాలసీలో కొనసాగుతున్న రైతులు అట్టి పాలనీలో ఏదైనా మార్పులు ఆధార్ కార్డులో తప్పులు, బ్యాంక్ ఖాతా మార్పు, నామినీ చనిపోతే మార్పు చేసుకోవడానికి చివరి తేది జూలై 30 నాటికి రైతులు భీమా సౌకర్యం పొందడానికి K. రజిని – AEO, గీసుగొండ 8106056126, V. విజయ్ – AEO, ఎలుకుర్తి 9493437301, అబిద్ హుస్సేన్ మొగిలిచర్ల 9640307196 అబిద్ హుస్సేన్, కావ్య ధర్మారం ఏఈఓ 7671875558 అఖల – AEO, విశ్వనాథపురం 7842588366 సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ బాబు తెలిపారు