జై భారత వాయిస్,కుందుర్ప
కుందుర్పి మండలం కేంద్రంలో గత కొంత కాలం క్రితం నవీన్ కుమార్ అనే యువకుడు విష్ణు వర్ధన్ అనే విద్యార్థి నీటి కుంటలో పడగ ఆ విద్యార్థిని కాపాడటానికి నవీన్ కుమార్ వెళ్లి దురదృష్ట వశాత్తూ ఇద్దరు మరణించారు. ఆ ఇరువురు కుటుంబాలను ఎమ్మెల్యే అమిలినేనీ సురేంద్ర బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి చెందిన నవీన్ తమ్ముడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అన్ని విధాల మీకు తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.