జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు నందు చౌక ధాన్యపు డిపో 09 మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప చేతుల మీదగా డీలర్ పొగాకుల మోహన్ డిపో ప్రారంభించడం జరిగింది. ఇక మీదట ప్రజలు చౌక ధాన్యపు డిపో లోనే బియ్యము_ఇతరనిత్యావసర సరుకులను పొందవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నారు.వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిత్యవసర సరుకులకు వేచి ఉండకుండా ప్రభుత్వం అందించే సరుకులను పొంది చౌక ధాన్యపు డిపోని వినియోగించుకోవాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమంలో 15వ వార్డు లోని తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి పార్టీ నాయకులు, తలారి రమేష్, సుగేపల్లి నరేష్, పూజారి నరేష్, వంశీ (జనసేన), బండి వన్నూరుస్వామి, దాసరి వెంకటేష్, వేణు, పూజారి గణేష్,మరియు రేషన్ కార్డుదారులు పాల్గొన్నారు.