జై భారత్ వాయిస్ హన్మకొండ
పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో బ్యాంక్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ మొదటి దశలో రుణమాఫీ పొందిన రైతులలో రెన్యువల్ కానీ వారిని గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని త్వరగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ అధికారుల ను ఆదేశించారు బ్యాంకులవారీగా సమీక్ష చేస్తూ ఎస్బిఐ ,యు బి ఐ ,ఏపీజీవీబీ లాంటి బ్యాంకులు అధిక సంఖ్యలో రుణమాఫీ ఖాతాలు కలిగి ఉన్నందువల్ల అదనపు సిబ్బందిని కేటాయించి 15వ తారీఖు లోపు మొదటి ,రెండవ విడతలలో మంజూరైన రైతుల ఖాతాలను రెన్యువల్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. రెండు విడతలలో కలిపి సుమారు 37,000 మంది రైతులు కు లబ్ధి పొందగా బ్యాంకర్స్ 8500 మాత్రమే రెన్యువల్ చేశారని తెలిపారు. ఇకపై రోజువారి సమీక్షలో ప్రతిరోజు నివేదిక సమర్పించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.
మహిళా శక్తి పథకం గురించి బ్యాంకర్లకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందువల్ల బ్యాంకర్ల సహకరించాలని కోరారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలను లక్ష అధికారులు చేసే ఉద్దేశంతో వారికి మండల సమాఖ్య, స్త్రీ నిధి మరియు బ్యాంకర్ల ద్వారా వివిధ రకాల వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు.బ్యాంకర్లు తమ పథకాలు ద్వారా సబ్సిడీని కూడా అందించడానికి ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా శక్తి పథకంలో 14 రకాల కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమాలకు బ్యాంకులు తప్పకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మరియు వ్యవసాయ శాఖ,బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.