జై భారత్ వాయిస్ కాకినాడ
సామాజిక ఫించన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారామాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభు త్వం అమలులోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు.
వృద్దు లకు వితంతువులకు దివ్యాంగ్యులకు ఒంటరి మహిళలకు ట్రాన్స్ జెం డర్స్ హెచ్‌ఐవీ వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న ఫించన్లను వారికి ఇచ్చినట్టుగా తీసే ఫోటోలను ప్రభుత్వ రికార్డులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. ప్రస్తుతం ఫించ న్ల పంపిణీ విధానం నడి రోడ్డు మీద ఇండ్ల బయ ట ఫించనుదారుని నిల బెట్టి దానం ఇస్తున్న తీరుగా పదిమంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్న ధోరణి వాటిని ఫేస్ బుక్ వాట్స ప్ గ్రూపుల్లో పోస్టు చేయడం వివిధ వర్గాల రాజకీయ పైత్యాలకు పరాకాష్టగా తయారయ్యిందన్నారు. బతికి చెడ్డ కుటుంబాలు వుంటాయని వారి ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వలన ఎంతో మంది చెప్పుకోలేని మానసికక్షోభకు గురవు తున్నారన్నారు. ఎమ్మెల్యే ఎంపీ కౌన్సిలర్ సర్పంచ్ లేదా అధికారి ఫించన్ ఇచ్చే సమయా ల్లో ఫోటో తీసి మీడియా ప్రచారం ఇవ్వడం వలన ఎటువంటి ఇబ్బందీవుండదని 64లక్షల 82 వేల 052 ఫించన్లు పంపిణీ లోనూ గోప్యత లేకుండా సామాజిక మాధ్యమాల్లో దానం చేస్తున్నట్టుగా వెలుస్తున్నాయన్నారు. ఫించను దారుల పట్ల మానవతా దృక్పథం గౌరవం లేకుం డా వివిధ శ్రేణులు పోటీ పడుతూ సామాజిక మాధ్యమాల్లో చేపడు తున్న పోస్టులు వికృ తంగా తయారవు తున్నాయన్నారు. ఎన్ టి ఆర్ హయాం నుండి వై ఎస్ ఆర్ హయాం వరకు ఫించన్లు పంపిణీ గౌరవప్రదంగా జరిగిన తీరుగా ప్రభుత్వ ఉద్యోగితో మాత్రమే రికార్డులకు పరిమితం అయ్యే వీడియోతో అందించే ఏర్పాటుతో గోప్యత పాటించాలన్నా రు. సామాజిక ఫించన్లు పంపిణీ ప్రచారం వికృతంగా తయారవుతున్న తీరు పట్ల మానవ హక్కుల కమీషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం వుందని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు.