న్యూఢిల్లీ / ఏలూరు: జై భారత్ వాయిస్ ఆగష్టు 02: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తికి, అందుకు అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో అచంచలమైన హామీ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు గౌరవ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రాజెక్టు పురోగతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబద్ధత నిజంగా అభినందనీయం అని తెలిపారు.
పోలవరం చరిత్ర ప్రస్తుత స్థితి గురించి మాట్లాడుతూ…
1940 లో కాన్సెప్ట్ చేసి 1980ల్లో ప్రారంభించిన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. 2014లో ఇది జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తింపబడింది నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గణనీయమైన పురోగతిని సాధించింది, 2014 2019 మధ్య 72% ప్రాజెక్ట్ చేసాం అని గుర్తు చేసారు. అయితే గత ఐదేళ్లలో ప్రాజెక్ట్ YSRCP ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం కారణంగా కాఫర్‌డ్యామ్ మరియు డయాఫ్రమ్ వాల్‌కు జరిగిన నష్టాలు ప్రాజెక్టును వెనుకకు నెట్టాయి అని తెలిపారు. తద్వారా ఆంధ్ర ప్రజలకు పూడ్చలేని నష్టాన్ని కలిగించాయి అని తెలిపారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
కేంద్రంలో NDA ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో మన అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి సంపూర్ణ అధికారంలో ఉన్నందున, ఈ కీలకమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అవసరమైన నాయకత్వం మనకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనిని గుర్తించి, మనం ప్రారంభించిన పనిని పూర్తి చేసే గొప్ప ఆదేశాన్ని అందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, నారా చంద్రబాబు నాయుడుల సంయుక్త నాయకత్వంలో పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయగలమన్న నమ్మకం ఉంది అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జాతీయ ప్రాజెక్టు. పోలవరానికి బడ్జెట్‌లో ఇచ్చిన హామీని, సకాలంలో పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఎంపీ మరొక అడుగు ముందుకు వేసి, పోలవరం స్థలాన్ని సందర్శించి, ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని ప్రత్యక్షంగా చూడవలసిందిగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారిని ఆహ్వానించారు. ఈ పర్యటన ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేయడమే కాకుండా, అవసరమైన ఆమోదాలు త్వరగా రావడానికి సహాయపడుతుంది, తద్వారా బాధిత వ్యక్తులందరికీ సకాలంలో ఉపశమనం మరియు పునరావాసం లభిస్తుంది అని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు.ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొన్ని ఈ క్రింది విషయాలను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు .పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అన్ని నిధులను విడుదల చేయండి అని ఎంపీ కోరారు.ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమైన బాధితుల ప్రయోజనం కోసం మౌలిక సదుపాయాలు మరియు రిలీఫ్ మరియు పునరావాస ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన అన్ని ఆమోదాలను వేగవంతం చేయాలనీ కోరారు.