నూజివీడు:జై భారత్ వాయిస్ ‘ 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఎమ్, ఆర్, పి, ఎస్. ఉద్యమానికి అధ్యక్షులైన మంద కృష్ణ మాధిగకు అధినుండి అండ దండ గా ఉండి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి జీవితాంతం రుణ పడి ఉంటామని ఎమ్, ఆర్, పి, ఎస్, నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీల వర్గీకరణ కు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులకు ప్రభుత్వానికి ప్రధాని మంత్రి నరేంద్రమోదీ కి రుణ పడి ఉంటామని అన్నారు.ఇంతటి చారిత్రక తీర్పుని ఇచ్చిన సుప్రీంకోర్టు 7 గురు న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు ప్రభుత్వం నుండి ఎంతో సహాయ సహకారం అందించిన మన రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి రికి రుణ పడి ఉంటానని నాయకులు అన్నారు. ఆనాడు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మంద కృష్ణ మాధిగకు నాటి నుండి నేటి వరకు ఎంతో తోడ్పాటు సహాయ సహకారాలు అందించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నాయకులు గుర్తు చేశారు మా నాయకులు మంద కృష్ణ మాధిగకు కృతజ్ఞతతో ఉంటామని ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నోకేసులకు లోనైన తరుణంలో మా ఈ ఉద్యమానికి వెన్నుతట్టి ఎంతో సహాయ సహకారాలు అందించింది మన ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారేనని తెలిపారు ఈ తీర్పు ద్వారా మా జాతికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని తద్వారా మా జాతి ఆర్ధికంగా ఎదుకుతుందని ఇక నుండి మా కష్టాలు తీరి సుఖ సంతోసాలతో ఉంటామని ఏవత్తు మా మాదిగ జాతి అంతా ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు రాజ్యాంగంలోని ఆర్టికల్ అనుసరించే ఈ షడ్యూల్ కులాలలోని ఉపకులాల అభివృద్ధికి వారి సామాజిక ఆర్ధిక ఎదుగుదలకు రిజర్వేషన్ ను కేటాయించ వచ్చునని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్థులకు ధన్యవాదాలు తెలిపారు తీర్పును పురస్కరించుకుని నూజివీడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని సంతోషాన్ని హార్సాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గ ప్రసాద్ గారు, నూజివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లి నాగరాజు , నూజివీడు నియోజకవర్గ ఎం.ఎస్.ఎఫ్ అధ్యక్షులు వేంపటి వెంకటేశ్వరరావు , ముళ్ళపూడి రామారావు , తుమ్మలపల్లి అశోక్ , బొడ్డు రాజుగారు,కలపాల విలియమ్స్ , దుబ్బాక దేవరాజు ,బొడ్డు రాజేష్ , పులపాక చంటి తదితరులు పాల్గొన్నారు.