జై భారత్ వాయిస్’ నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో గల మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణములోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు. పుస్తకాలు పంపిణీ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర మంత్రి పార్థసారథి హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలు చెప్పిన సమస్యలలో ప్రధానంగా ఫ్యాన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రహించిన మంత్రి పార్థసారథి తక్షణమే ఫ్యాన్లు అందించాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ తనిఖీ చేసి 24 గంటలు గడవకముందే బాలికల కష్టాలు తీర్చేందుకు ఫ్యాన్లు అందించడంతో బాలికలు, హాస్టల్ వార్డెన్ రాష్ట్ర మంత్రి పార్థసారధికి కృతజ్ఞతలు తెలిపారు.
